రౌల్ కాస్ట్రోప్రై అమెరికా ఆంక్షలు
Sakshi Education
క్యూబా మాజీ అధ్యక్షుడు రౌల్ కాస్ట్రో, ఆయన కుటుంబసభ్యుల విదేశీ ప్రయాణాలపై అమెరికా సెప్టెంబర్ 26న ఆంక్షలు విధించింది.
అధ్యక్ష పదవి నుంచి వైదొలగినప్పటికీ అధికార కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి హోదాలో రౌల్ కాస్ట్రో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని అమెరికా ఆరోపించింది. ఏకపక్షంగా వేలాది మందిని నిర్బంధిస్తున్నారని, ప్రస్తుతం 100 మంది క్యూబన్లు రాజకీయ ఖైదీలుగా ఉన్నారని విమర్శించింది. దివంగత విప్లవ నేత సోదరుడైన రౌల్ కాస్ట్రో(88) ఆంక్షల కారణంగా అమెరికా వెళ్లడం వీలుకాదు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : క్యూబా మాజీ అధ్యక్షుడు రౌల్ కాస్ట్రోప్రై ఆంక్షలు
ఎప్పుడు : సెప్టెంబర్ 26
ఎవరు : అమెరికా
క్విక్ రివ్యూ :
ఏమిటి : క్యూబా మాజీ అధ్యక్షుడు రౌల్ కాస్ట్రోప్రై ఆంక్షలు
ఎప్పుడు : సెప్టెంబర్ 26
ఎవరు : అమెరికా
Published date : 27 Sep 2019 05:41PM