Skip to main content

రైతుల కోసం రెండు యాప్‌లు

రైతులకు వ్యవసాయానికి సంబంధించిన సమాచారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు మొబైల్ యాప్‌లను రూపొందించింది.
వీటి ద్వారా వ్యవసాయానికి అవసరమైన సమగ్ర సమాచారం నేరుగా రైతుల ఫోన్లలోకి రానుంది. దేశంలోని రైతులు ట్రాక్టర్లు కొనేందుకు, వ్యవసాయానికి సంబంధించిన యంత్రాలను ఎంపిక చేసుకునేందుకు ‘సీహెచ్‌సీ-ఫామ్ మెషినరీ’ మొబైల్ యాప్‌ను కేంద్రం రూపొందించింది. అలాగే వాతావరణానికి సంబంధించిన సలహాలు ఇవ్వడంతో పాటు కొత్త టెక్నాలజీలను క్షేత్ర స్థాయిలో వినియోగించుకునేందుకు కావాల్సిన అంశాలు, విత్తన కేంద్రాల సమాచారంతో ‘క్రిషి కిసాన్’ అనే మరో యాప్‌ను రూపొందించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
రైతుల కోసం రెండు యాప్‌లు
ఎప్పుడు : సెప్టెంబర్ 24
ఎవరు : కేంద్రప్రభుత్వం
Published date : 25 Sep 2019 05:42PM

Photo Stories