Skip to main content

రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపివేత

కృష్ణా నదీ జలాలను మళ్లిస్తూ ఆంధ్రప్రదేశ్ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే నిలిపివేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Current Affairs
కొత్త ప్రాజెక్టుల నిర్మాణ పనుల విషయంలో కేంద్ర జలసంఘం అనుమతి లేకుండా ముందుకెళ్లొద్దని హెచ్చరించింది. ఈ మేరకు ఏపీ జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌కు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి హరికేశ్ మీనా జూలై 30న లేఖ రాశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని మళ్లించేందుకు ఏపీ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పునర్విభజన చట్టానికి విరుద్ధమైందని తెలంగాణ ప్రభుత్వం బోర్డుకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిస్పందించిన బోర్డు, ఏపీకి ఈ లేఖ రాసింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపివేత
ఎప్పుడు : జూలై 30
ఎవరు : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు
ఎందుకు : కొత్త ప్రాజెక్టుల నిర్మాణ పనుల విషయంలో కేంద్ర జలసంఘం అనుమతి లేకుండా ముందుకెళ్లొద్దని
Published date : 01 Aug 2020 01:03PM

Photo Stories