Skip to main content

రాష్ట్రపతి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం

2020, ఆగస్టు 15న 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆగస్టు 14న ప్రసంగించారు.
Current Affairs
భారత్‌ శాంతికాముక దేశమని ఈ సందర్భంగా కోవింద్ పేర్కొన్నారు. అయితే, ఎవరైనా ఆక్రమణవాదదుస్సాహసానికి పాల్పడితే తగిన గుణపాఠం చెప్పగల సామర్థ్యం ఉన్న దేశమని స్పష్టం చేశారు.

రాష్ట్రపతి ప్రసంగం-ముఖ్యాంశాలు
  • ప్రపంచమంతా కరోనాతో పోరాడుతున్న సమయంలో మన పొరుగుదేశంవిస్తరణవాదదుస్సాహసానికి పాల్పడింది. భారతీయ సైనికులు అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించి, ప్రాణాలు పణంగా పెట్టి దేశ భూభాగాన్ని కాపాడుకున్నారు.
  • ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చెప్పిన స్వావలంబన విధానం ప్రపంచాన్ని కలుపుకుని పోయేదే.
  • లగించే ప్రయత్నం చేశారు.
  • కరోనా వైరస్‌పై ముందుండి అలుపెరగని పోరాటం చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకి దేశమంతా రుణపడి ఉంది.
  • రామ మందిర వివాదాన్ని శాంతియుతంగా న్యాయవ్యవస్థ పరిష్కరించింది. సుప్రీంకోర్టు తీర్పును అన్ని వర్గాలు ఆమోదించి.. భారతీయ శాంతి, అహింస, ప్రేమ, సౌభ్రాతృత్వ భావనలను ప్రపంచానికి చూపాయి.
  • 2020 ఏడాదిలో కరోనా అనే కంటికి కనిపించని సూక్ష్మజీవి మానవాళికి గొప్ప పాఠాలు నేర్పించింది.
Published date : 15 Aug 2020 10:19PM

Photo Stories