Skip to main content

రాష్ట్రంలో ఐఎస్‌ఓకు ఎంపికైన మొదటి గ్రామం?

సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్‌ మండలానికి చెందిన ఇర్కోడ్‌ గ్రామం ఏటా ప్రత్యేక కార్యక్రమాలతో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును పొందుతూ ఆదర్శంగా నిలుస్తోంది.
Current Affairs
పంచాయతీ పరిధిలో ఉన్నత ప్రమాణాలను పాటిస్తూ సేవలందించినందుకు గాను ఐఎస్‌ఓ (ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌ ఆర్గనైజేషన్‌) ఏప్రిల్‌ 16న గ్రామాన్ని ఎంపిక చేసి సర్టిఫికెట్‌ను ఆన్‌లైన్‌ ద్వారా అందించింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఐఎస్‌ఓకు ఎంపికైన మొదటి గ్రామంగా ఇర్కోడ్‌ నిలిచింది.

జాతీయ పురస్కారాలు, ప్రత్యేక కార్యక్రమాలు
మొత్తం 650 గృహాలు, 2,482 జనాభా కలిగిన ఇర్కోడ్‌ గ్రామం.. గతంలో 2016–17, 2017–18 సంవత్సరాలకు గాను శానిటేషన్, సోషల్‌ సెక్టార్‌ విభాగాల్లో రెండుసార్లు జాతీయ స్థాయి స్వశక్తి కరణ్‌ అవార్డులను సొంతం చేసుకుంది. తెలంగాణ ప్రస్తుత ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో గ్రామంలో మహిళల ఆర్థిక సాధికారత కోసం మటన్, చికెన్‌ పచ్చడి తయారీతో గుర్తింపు పొందింది.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : తెలంగాణ ఐఎస్‌ఓకు ఎంపికైన మొదటి గ్రామం?
ఎప్పుడు : ఏప్రిల్‌ 16
ఎవరు : ఇర్కోడ్‌ గ్రామం
ఎక్కడ : ఇర్కోడ్‌ గ్రామం, సిద్దిపేట రూరల్‌ మండలం, సిద్దిపేట జిల్లా
ఎందుకు : పంచాయతీ పరిధిలో ఉన్నత ప్రమాణాలను పాటిస్తూ సేవలందించినందుకు గాను
Published date : 19 Apr 2021 11:37AM

Photo Stories