Skip to main content

రాష్ట్రీయ కామధేను ఆయోగ్‌కు ఆమోదం

గోవుల సంరక్షణ, వాటి సంతాన వృద్ధి కోసం ‘రాష్ట్రీయ కామధేను ఆయోగ్’ పేరుతో ఒక కొత్త కమిషన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఫిబ్రవరి 6న జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త కమిషన్ ఆవుల సంరక్షణ, వాటి సంతాన వృద్ధికి సబంధించిన అంశాలను పర్యవేక్షిస్తుందనీ, దీని ద్వారా దేశీయ జాతులకు చెందిన పశుసంపద పెరుగుతుందని కేంద్ర మంత్రి రవిశంకర్ చెప్పారు. రైతులు, మహిళల ఆదాయం పెరగడానికి ఈ నిర్ణయం దోహదం చేస్తుందన్నారు.

కేబినెట్ ఇతర నిర్ణయాలు
ఏఎంఐఎఫ్‌కు రూ. 2 వేల కోట్లు
వ్యవసాయ మార్కెట్ మౌలిక నిధి (ఏఎంఐఎఫ్)ను రూ. 2 వేల కోట్లతో సృష్టించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నాబార్డ్ ద్వారా సృష్టించే ఈ నిధి గ్రామీణ వ్యవసాయ మార్కెట్లు, క్రమబద్ధీకరించిన హోల్‌సేల్ మార్కెట్లలో మౌలిక వసతుల అభివృద్ధికి ఉపయోగపడనుంది.

సినిమాటోగ్రాఫ్ చట్ట సవరణకు ఆమోదం
సినిమాటోగ్రాఫ్ చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పైరసీకి పాల్పడితే మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ. 10 లక్షల వరకు జరిమానా లేదా ఈ రెండూ కలిపి విధించాలని ప్రతిపాదించారు. దీనిద్వారా హరియాణాలో ఉన్న ఎన్‌ఐఎఫ్‌టీఈఎం, తమిళనాడు తంజావూరులోని ఐఐఎఫ్‌పీటీలకు జాతీయ విద్యా సంస్థల హోదా లభిస్తుంది. ప్రసార భారతికి వచ్చే మూడేళ్లలో వివిధ కార్యక్రమాలు, కార్యకలాపాల కోసం రూ. 1,054 కోట్లను కేటాయించనున్నారు. ఆర్థికంగా బలహీన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో సవరించిన ఆఫీస్ మెమొరాండం (ఓఎం)కు ఆమోదం తెలిపింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
‘రాష్ట్రీయ కామధేను ఆయోగ్’ పేరుతో ఒక కొత్త కమిషన్ ఏర్పాటుకు ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 6
ఎవరు : కేంద్ర కేబినెట్
Published date : 07 Feb 2019 06:03PM

Photo Stories