రాఫెల్ నాదల్‌కు మెక్సికో ఓపెన్ టైటిల్
Sakshi Education
ప్రపంచ రెండో ర్యాంకర్, స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ 2020 ఏడాది తన ఖాతాలో తొలి టైటిల్‌ను జమ చేసుకున్నాడు.
మెక్సికోలోని అకాపుల్కోలో మార్చి 1న ముగిసిన మెక్సికో ఓపెన్ ఏటీపీ-500 టోర్నీలో 33 ఏళ్ల నాదల్ చాంపియన్‌గా నిలిచాడు. ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో నాదల్ 6-3, 6-2తో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై గెలిచాడు. మెక్సికో ఓపెన్‌ను నాదల్ నెగ్గడం ఇది మూడోసారి. గతంలో నాదల్ 2013, 2015లలో విజేతగా నిలిచాడు. ఓవరాల్‌గా నాదల్ కెరీర్‌లో ఇది 85వ సింగిల్స్ టైటిల్. విజేతగా నిలిచిన నాదల్‌కు 3,72,785 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 కోట్ల 69 లక్షలు)తోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మెక్సికో ఓపెన్ ఏటీపీ-500 టోర్నీ టైటిల్ విజేత
ఎప్పుడు : మార్చి 1
ఎవరు : రాఫెల్ నాదల్
ఎక్కడ : అకాపుల్కో, మెక్సికో
క్విక్ రివ్యూ :
ఏమిటి : మెక్సికో ఓపెన్ ఏటీపీ-500 టోర్నీ టైటిల్ విజేత
ఎప్పుడు : మార్చి 1
ఎవరు : రాఫెల్ నాదల్
ఎక్కడ : అకాపుల్కో, మెక్సికో
Published date : 02 Mar 2020 05:43PM