రామా చంద్రమౌళికి నాజినామన్ పురస్కారం
Sakshi Education
వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన ప్రముఖ కవి, కథానవలా రచయిత రామా చంద్రమౌళి నాజినామన్ సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు.
దీంతో ఈ ఎంపికై న మొదటి తెలుగు సాహిత్యవేత్తగా ఆయన నిలిచారు. లెబనాన్‌కు చెందిన నాజినామన్ ఫౌండేషన్ మూడు విభాగాల్లో అందించే ఈ పురస్కారానికి వివిధ దేశాల నుంచి మొత్తం 60 ఎంపికయ్యారు. వీరిలో నలుగురు భారతీయులు ఉన్నారు. నలుగురు భారతీయులలో మెరిట్ ప్రైజ్ విభాగంలో బెంగాల్ కవి దెబశిశ్ లహరి, క్రియేటివిటీ ప్రైజ్ విభాగంలో అశోక్ చక్రవర్తి టోలోనా, దేవశ్రీ తివారీ ఎంపికయ్యారు. ఇక హానర్ ప్రైజ్ విభాగంలో 61 రచనలు చేసిన కవి, రచయితగా రామా చంద్రమౌళిని జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపిక చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నాజినామన్ సాహిత్య పురస్కారం
ఎప్పుడు : జూన్ 7
ఎవరు : రామా చంద్రమౌళి
ఎక్కడ : హానర్ ప్రైజ్ విభాగంలో
క్విక్ రివ్యూ :
ఏమిటి : నాజినామన్ సాహిత్య పురస్కారం
ఎప్పుడు : జూన్ 7
ఎవరు : రామా చంద్రమౌళి
ఎక్కడ : హానర్ ప్రైజ్ విభాగంలో
Published date : 08 Jun 2019 06:15PM