రామ మందిరం ట్రస్టు అధ్యక్షుడిగా నృత్యగోపాల్
Sakshi Education
అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఏర్పాటైన ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు’ అధ్యక్షుడిగా మహంత్ నృత్యగోపాల్ దాస్, ప్రధాన కార్యదర్శిగా చంపాత్ రాయ్, కోశాధికారిగా స్వామి గోవింద్ దేవ్ గిరి ఎన్నికయ్యారు.
అలాగే ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర ప్రిన్సిపల్ కార్యదర్శిగా పనిచేసిన నృపేంద్ర మిశ్రా మందిర నిర్మాణ కమిటీ చీఫ్‌గా ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 19న జరిగిన ట్రస్టు తొలి సమావేశంలో వీరిని ఎన్నుకున్నారు. లాయర్ కె.పరాశరన్ నివాసంలో జరిగిన ఈ సమావేశానికి కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రతినిధిగా హోంశాఖ అదనపు కార్యదర్శి జ్ఞానేశ్ కుమార్, యూపీ ప్రభుత్వ ప్రతినిధిగా అవినాశ్ అవస్తి, అయోధ్య జిల్లా మెజిస్ట్రేట్ జస్టిస్ అనూజ్‌కుమార్ ఝా హాజరయ్యారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధ్యక్షుడిగా ఎన్నిక
ఎప్పుడు : ఫిబ్రవరి 19
ఎవరు : మహంత్ నృత్యగోపాల్ దాస్
క్విక్ రివ్యూ :
ఏమిటి : శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధ్యక్షుడిగా ఎన్నిక
ఎప్పుడు : ఫిబ్రవరి 19
ఎవరు : మహంత్ నృత్యగోపాల్ దాస్
Published date : 20 Feb 2020 07:17PM