Skip to main content

రాజ్యసభకు ఎంపికైన మాజీ పాత్రికేయుడు?

పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, ఎన్నికల్లో ఓడిన మాజీ పాత్రికేయుడు స్వపన్‌ దాస్‌గుప్తా మళ్లీ రాజ్యసభకు ఎన్నికయ్యారు.
Current Affairs
ఆయనను పార్లమెంట్‌ ఎగువసభకు మళ్లీ నామినేట్‌ చేస్తున్నట్లు జూన్ 1న కేంద్ర ప్రభుత్వం తెలిపింది.ప్రముఖ న్యాయవాది దివంగత రాం జఠ్మలానీ కుమారుడైన న్యాయవాది మహేశ్‌ జఠ్మలానీని సైతం ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్‌ చేసింది. 2022 ఏప్రిల్‌ 24వ తేదీ దాకా స్వపన్‌దాస్‌ను రాజ్యసభ సభ్యునిగా కొనసాగిస్తూ భారత రాజ్యాంగంలోని అధికరణాల ప్రకారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నిర్ణయం తీసుకున్నారంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జూన్ 1న నోటిఫికేషన్‌ విడుదలచేసింది. 2024 జూలై 13వ తేదీ దాకా మహేశ్‌ జఠ్మలానీ రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతారని కేంద్రం మరో నోటిఫికేషన్‌లో పేర్కొంది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : రాజ్యసభకు ఎంపికైన మాజీ పాత్రికేయుడు, న్యాయవాది
ఎప్పుడు : జూన్ 1
ఎవరు : మాజీ పాత్రికేయుడు స్వపన్‌ దాస్‌గుప్తా, న్యాయవాది మహేశ్‌ జెఠ్మలానీ
Published date : 04 Jun 2021 12:23PM

Photo Stories