రాజర్‌హాట్‌లో ఎన్‌ఎస్‌జీ కాంప్లెక్స్ ప్రారంభం
Sakshi Education
కోల్‌కతా సమీపంలోని రాజర్‌హాట్‌లో జాతీయ భద్రతా దళం (ఎన్‌ఎస్‌జీ) 29వ స్పెషల్ కంపోసిట్ గ్రూప్ (ఎస్‌సీజీ) కాంప్లెక్స్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మార్చి 1న ప్రారంభించారు.
అలాగే మానేసర్, హైదరాబాద్, చెన్నై, ముంబైలోని ఎన్‌ఎస్‌జీ భవనాల్ని కూడా కోల్‌కతా నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఎన్‌ఎస్‌జీ అంటే ఉగ్ర వ్యతిరేక దళంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని అన్నారు. 10 వేల ఏళ్ల చరిత్రలో భారత్ ఎలాంటి దాడులూ జరపలేదని.. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయన్నారు. ఎవరైనా తమ భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించినా.. జవాన్లు, ప్రజల మీద దాడులకు యత్నించినా.. భారత్ గట్టిగా బదులిస్తుందని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎన్‌ఎస్‌జీ 29వ ఎస్‌సీజీ కాంప్లెక్స్ ప్రారంభం
ఎప్పుడు : మార్చి 1
ఎవరు : కేంద్ర హోం మంత్రి అమిత్‌షా
ఎక్కడ : రాజర్‌హాట్, కోల్‌కతా సమీపం, పశ్చిమ బెంగాల్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎన్‌ఎస్‌జీ 29వ ఎస్‌సీజీ కాంప్లెక్స్ ప్రారంభం
ఎప్పుడు : మార్చి 1
ఎవరు : కేంద్ర హోం మంత్రి అమిత్‌షా
ఎక్కడ : రాజర్‌హాట్, కోల్‌కతా సమీపం, పశ్చిమ బెంగాల్
Published date : 02 Mar 2020 05:39PM