Skip to main content

Pradhan Mantri Jan Dhan Yojana: ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజనను ఎప్పుడు ప్రారంభించారు?

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన(పీఎంజేడీఐ) ఏడేళ్లు పూర్తి చేసుకుంది.
ప్రస్తుతం ఈ పథకం కింద ప్రారంభించిన బ్యాంకు అకౌంట్ల సంఖ్య 43 కోట్లకు చేరుకోగా డిపాజిట్ల మొత్తం రూ.1.46 లక్షల కోట్లున్నట్లు ఆగస్టు 28న కేంద్రం ఆర్థిక శాఖ వెల్లడించింది. సామాన్య ప్రజలకు బ్యాంకింగ్, చెల్లింపులు, క్రెడిట్, బీమా, పింఛను వంటి ఆర్థిక సేవలు సులభంగా అందుబాటులో ఉండే లక్ష్యంతో 2014 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించారు. అనంతరం ఈ పథకాన్ని అదే ఏడాది 2014, ఆగస్టు 28వ తేదీ నుంచి ప్రారంభించారు.

2014లో పీఎంజేడీఐ కింద ప్రారంభించిన బ్యాంకు ఖాతాల సంఖ్య 17.90 కోట్లు కాగా, 2021, ఆగస్టు 18వ తేదీ నాటికి ఇవి 43.04 కోట్లకు పెరిగాయి. వీటిలో 55.47 శాతం అంటే, 23.87 కోట్ల ఖాతాలు మహిళలవే.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : 2014, ఆగస్టు 28వ తేదీన పీఎం జన్‌ధన్‌ యోజన ప్రారంభం
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : దేశవ్యాప్తంగా...
ఎందుకు : సామాన్య ప్రజలకు బ్యాంకింగ్, చెల్లింపులు, క్రెడిట్, బీమా, పింఛను వంటి ఆర్థిక సేవలు సులభంగా అందుబాటులో ఉండే లక్ష్యంతో...
Published date : 30 Aug 2021 06:01PM

Photo Stories