Skip to main content

ఫుట్‌బాల్ దిగ్గజం పీలే రికార్డును సమం చేసిన అర్జెంటీనా ఆటగాడు?

బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే నెలకొల్పిన ఆల్‌టైమ్ క్లబ్ గోల్స్(అత్యధిక గోల్స్) రికార్డును అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లయనెల్ మెస్సీ సమం చేశాడు.
Edu news
స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో డిసెంబర్ 20న జరిగిన స్పెయిన్ లీగ్ లా లిగా టోర్నీలో మెస్సీ... బార్సిలోనా క్లబ్ తరఫున బరిలోకి దిగాడు. టోర్నీలో భాగంగా వాలెన్సియాతో జరిగిన మ్యాచ్‌లో గోల్ చేశాడు. దీంతో పీలే పేరిట ఉన్న 643 గోల్స్ రికార్డును మెస్సీ సమం చేశాడు. పీలే 1957 నుంచి 1974 వరకు సాంటోస్ క్లబ్‌కు ఆడి ఈ రికార్డు గోల్స్(643 గోల్స్) చేశాడు.

మెస్సీ పేరిటే...
ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక గోల్స్ చేసిన గెర్డ్ ముల్లర్ (జర్మనీ-86 గోల్స్) రికార్డు కూడా ఇప్పుడు మెస్సీ పేరిటే ఉంది. 2012లో మెస్సీ 91 గోల్స్‌తో ముల్లర్ రికార్డును అధిగమించాడు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఫుట్‌బాల్ దిగ్గజం పీలే రికార్డు(అత్యధిక గోల్స్-643)ను సమం చేసిన అర్జెంటీనా ఆటగాడు
ఎప్పుడు : డిసెంబర్ 20
ఎవరు : లయనెల్ మెస్సీ
ఎక్కడ : మాడ్రిడ్, స్పెయిన్
Published date : 21 Dec 2020 07:40PM

Photo Stories