ఫ్రీడం ఆఫ్ రిలీజియన్ బిల్‌కి ఆమోదం తెలిపిన రాష్ట్రం?
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించిన బిల్లు ఇటీవల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ‘ప్రొహిబిషన్ ఆఫ్ అన్‌లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలిజియన్ ఆర్డినెన్స్, 2020’ని పోలి ఉంది. మోసపూరితంగా గానీ, బలవంతంగా గానీ, భయపెట్టిగానీ, ఏదైనా ప్రలోభంతో గానీ పెళ్ళి పేరుతో మతమార్పిడికి పాల్పడడం ఈ చట్టరీత్యా నిషేధం. దాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రం...
అవతరణ: నవంబర్ 1, 1956
రాజధాని: భోపాల్
మధ్యప్రదేశ్ ప్రస్తుత గవర్నర్: ఆనందీబెన్ పటేల్
మధ్యప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి: శివరాజ్ సింగ్ చౌహాన్
లోక్సభ సీట్లు: 29
రాజ్యసభ: 11
హైకోర్టు: మధ్యప్రదేశ్ హైకోర్టు(జబల్‌పూర్‌లో ఉంది)
హైకోర్టు బెంచ్లు: గ్వాలియర్, ఇండోర్.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మధ్యప్రదేశ్ ఫ్రీడం ఆఫ్ రిలీజియన్ బిల్ 2021 ఆమోదం
ఎప్పుడు : మార్చి 8
ఎవరు : మధ్యప్రదేశ్ అసెంబ్లీ
ఎందుకు : వివాహం పేరుతో మోసపూరిత మతమార్పిడిలను నిరోధించేందుకు