Skip to main content

ఫ్రెంచ్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ విజేత ఎవరు?

ఫ్రెంచ్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నోవాక్‌ జొకోవిచ్‌ చాంపియన్‌గా అవతరించాడు.
Current Affairs ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో జూన్‌ 13న జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్, ప్రపంచ నంబర్‌వన్‌ జొకోవిచ్‌ 4 గంటల 11 నిమిషాల్లో 6–7 (6/8), 2–6, 6–3, 6–2, 6–4తో ఐదో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌)పై గెలిచి టైటిల్‌ కైవసం చేసుకున్నాడు. దీంతో జొకోవిచ్‌... తన కెరీర్‌లో రెండోసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్‌గా నిలువడంతోపాటు 19వ గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ను హస్తగతం చేసుకున్నాడు. 2016లో తొలిసారి అతను ఈ టైటిల్‌ నెగ్గాడు. విజేత జొకోవిచ్‌కు 14 లక్షల యూరోలు (రూ. 12 కోట్ల 41 లక్షలు)... రన్నరప్‌ సిట్సిపాస్‌కు 7 లక్షల 50 వేల యూరోలు (రూ. 6 కోట్ల 65 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

విశేషాలు...
  • పురుషుల టెన్నిస్‌లో ‘కెరీర్‌ గ్రాండ్‌స్లామ్‌’ (నాలుగు వేర్వేరు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ గెలవడం) ఘనతను రెండుసార్లు చొప్పున నమోదు చేసిన మూడో ప్లేయర్‌ జొకోవిచ్‌. గతంలో రాడ్‌ లేవర్‌ (ఆస్ట్రేలియా–1969), రాయ్‌ ఎమర్సన్‌ (ఆస్ట్రేలియా–1967) మాత్రమే ఈ ఘనత సాధించారు.
  • జొకోవిచ్‌ నెగ్గిన గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ (ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌–9; ఫ్రెంచ్‌ ఓపెన్‌–2; వింబుల్డన్‌–5; యూఎస్‌ ఓపెన్‌–3). ఫెడరర్, రాఫెల్‌ నాదల్‌ (20 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌తో) సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : ఫ్రెంచ్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ విజేత ఎవరు?
ఎప్పుడు : జూన్‌ 13
ఎవరు : సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నోవాక్‌ జొకోవిచ్‌
ఎక్కడ : పారిస్, ఫ్రాన్స్‌
Published date : 15 Jun 2021 08:21PM

Photo Stories