Skip to main content

ఫ్రాన్స్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మక్రాన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిగిన ఈ సమావేశంలో జమ్మూకశ్మీర్ అంశంతోపాటు ద్వైపాక్షిక, రక్షణ, ఉగ్రవాద నిర్మూలన వంటి అంశాలపై ఇరువురు నేతలు విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మక్రాన్ మాట్లాడుతూ.. కశ్మీర్ విషయంలో మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదని.. అది పూర్తిగా భారత్-పాక్ ద్వైపాక్షిక అంశమని స్పష్టం చేశారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మక్రాన్‌తో భేటీ
ఎప్పుడు : ఆగస్టు 22
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : పారిస్, ఫ్రాన్స్
Published date : 23 Aug 2019 05:44PM

Photo Stories