Skip to main content

ఫొటోగ్రాఫర్ రఘురాయ్‌కు అకాడమీ అవార్డు

ప్రముఖ భారతీయ ఫొటోగ్రాఫర్, పద్మశ్రీ పురస్కార గ్రహీత రఘురాయ్ ‘అకాడమీ దేస్ బియా-ఆర్‌‌ట్స ఫొటోగ్రఫీ’ అవార్డుకు ఎంపికయ్యారు.
ఈ విషయాన్ని సెప్టెంబర్ 14న అవార్డు కమిటీ వెల్లడించింది. ఫ్రాన్స్కు చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ విలియమ్ క్లీన్ పేరిట ఈ ఏడాదే అకాడమీ అవార్డును ఏర్పాటు చేశారు. దీంతో ఈ అవార్డుకు ఎంపికైన తొలి వ్యక్తిగా రఘురాయ్ నిలిచాడు. ఈ అవార్డు కింద 1,20,000 యూరోల (రూ.9.4 లక్షలు) నగదు బహుమతి అందిస్తారు. 1965లో ఫొటోగ్రాఫర్‌గా కెరీర్‌ను ఆరంభించిన రఘురాయ్ పలు ప్రతిష్ఠాత్మక సంస్థల్లో పనిచేశారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
అకాడమీ దేస్ బియా-ఆర్ట్స్ ఫొటోగ్రఫీ అవార్డుకు ఎంపిక
ఎప్పుడు : సెప్టెంబర్ 14
ఎవరు : రఘురాయ్
Published date : 17 Sep 2019 05:42PM

Photo Stories