ఫోర్బ్స్ మహిళా వ్యాపారవేత్తల జాబితా విడుదల
Sakshi Education
అమెరికాలోని 80 మందితో కూడిన అత్యంత ధనిక మహిళల జాబితాను జూన్ 7న ఫోర్బ్స్ విడుదల చేసింది.
ఈ జాబితాలో ఏబీసీ సప్లై సంస్థ చైర్‌పర్సన్ డయానే హెండ్రిక్స్ దాదాపు రూ.4 లక్షల కోట్ల సంపాదనతో మొదటి స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో ముగ్గురు భారత సంతతి వ్యాపారులు స్థానం సంపాదించారు. భారత సంతతికి చెందిన వారిలో అరిస్టా నెట్‌వర్క్స్ సీఈవో జయశ్రీ ఉల్లాల్ రూ.97 వేల కోట్లతో 18వ స్థానంలో ఉన్నారు. అలాగే సింటెల్ సహ వ్యవస్థాపకురాలు నీరజా సేథీ రూ.35 వేల కోట్లతో 23వ స్థానం పొందారు. కన్‌ఫ్లుయెంట్ టెక్నాలజీ కంపెనీ సహవ్యవస్థాపకురాలు నేహా నార్కేడే రూ.24 వేల కోట్లతో 60వ స్థానంలో నిలిచారు.
Published date : 08 Jun 2019 06:17PM