ఫోర్బ్స్ ఇండియా కుబేరుల్లో రెండో స్థానంలో నిలిచిన సంపన్నుడు?
సుమారు 8,870 కోట్ల డాలర్ల (దాదాపు రూ. 6,56,000 కోట్లు) సంపదతో వరుసగా పదమూడోసారీ జాబితాలో తొలిస్థానం దక్కించుకున్నారు. ముకేశ్ తర్వాత గౌతమ్ అదానీ రెండో స్థానంలో, శివ్ నాడార్ మూడో స్థానంలో నిలిచారు.
కరోనా ప్రభావం ఉన్నా...
కరోనా వైరస్ మహమ్మారి భారత్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపినప్పటికీ టాప్ 100 సంపన్నుల్లో సగం మంది సంపద గణనీయంగానే పెరిగిందని ఫోర్బ్స్ వెల్లడించింది. ‘వీరందరి సంపద గతేడాదితో పోలిస్తే 14 శాతం పెరిగి 51,700 కోట్ల డాలర్లకు చేరింది‘ అని పేర్కొంది. ముకేశ్ సంపద మరో 3,730 కోట్ల డాలర్లు పెరిగిందని వివరించింది. ఫోర్బ్స్ జాబితా ప్రకారం...
దేశంలోని మొదటి ఐదు మంది కుబేరులు | |||
ర్యాంకు | పేరు | సంస్థ | సంపద (కోట్ల డాలర్లలో) |
1 | ముకేశ్ అంబానీ | రిలయన్స్ | 8,870 |
2 | గౌతమ్ అదానీ | అదానీ గ్రూప్ | 2,520 |
3 | శివ నాడార్ | హెచ్‌సీఎల్ | 2,040 |
4 | రాధాకిషన్ దమానీ | అవెన్యూ సూపర్‌మార్‌ట్స | 1,540 |
5 | హిందుజా సోదరులు | అశోక్ లేల్యాండ్ | 1,280 |
తెలుగు రాష్ట్రాల దిగ్గజాలు | |||
20 | మురళి దివి | దివీస్ ల్యాబొరేటరీస్ | 650 |
43 | డాక్టర్ రెడ్డీస్ ప్రమోటర్ల కుటుంబం | డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ | 325 |
45 | పి.పి. రెడ్డి | మేఘా ఇంజనీరింగ్ | 310 |
49 | పి.వి రాంప్రసాద్ రెడ్డి | అరబిందో ఫార్మా | 290 |
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫోర్బ్స్ ఇండియా కుబేరుల్లో రెండో స్థానంలో నిలిచిన సంపన్నుడు
ఎప్పుడు : అక్టోబర్ 8
ఎవరు : గౌతమ్ అదానీ
ఎక్కడ : దేశంలో