Skip to main content

ఫోర్బ్స్ ధనిక క్రీడాకారుల్లో కోహ్లీ

ఫోర్బ్స్ 2018 సంవత్సరానికి గానూ విడుదల చేసిన అత్యంత ధనిక క్రీడాకారులు-100 జాబితాలో భారత క్రికెటర్ విరాట్ కోహ్లీకి చోటు లభించింది.
ఈ జాబితాలో రూ.2.5 కోట్ల డాలర్ల (సుమారు రూ.173 కోట్లు) ఆదాయంతో కోహ్లీ 100వ స్థానంలో నిలిచాడు. దీంతో ఈ జాబితాలో చోటు సంపాందించిన ఏకైక భారత క్రీడాకారుడిగా కోహ్లీ గుర్తింపు పొందాడు. 2017 జాబితాలో 2.4 కోట్ల డాలర్ల ఆదాయంతో 83వ స్థానంలో కోహ్లీ ఉన్నాడు.

ఫోర్బ్స్ అత్యంత ధనిక క్రీడాకారులు-100 జాబితాలో అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ 127 మిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఫోర్బ్స్ టాప్ అథ్లెట్స్ లిస్టులో ఒక ఫుట్‌బాల్ ప్లేయర్ టాప్‌లో నిలవడం ఇదే మొదటిసారి. పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో 109 మిలియన్ డాలర్లతో రెండవ, బ్రెజిల్ ఫుట్‌బాలర్ నెయ్‌మార్ 105 మిలియన్ డాలర్లతో మూడవ స్థానంలో ఉన్నారు. స్విట్జర్లాండ్ టెన్నిస్ ఆటగాడు రోజర్ ఫెదరర్ 93.4 మిలియన్ డాలర్ల సంపాదనతో ఐదో స్థానంలో నిలిచాడు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఫోర్బ్స్ 2018 అత్యంత ధనిక క్రీడాకారులు-100 జాబితాలో 100వ స్థానం
ఎప్పుడు : జూన్ 12
ఎవరు : విరాట్ కోహ్లీ
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
Published date : 13 Jun 2019 05:54PM

Photo Stories