ఫజా ఇంటర్నేషనల్ వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రి ఎక్కడ జరిగింది?
Sakshi Education
యూఏఈలోని దుబాయ్‌లో జరుగుతున్న 12వ ఫజా ఇంటర్నేషనల్ వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రి మీట్ ముగిసింది.
ఈ గ్రాండ్‌ప్రిలో భారత్ మొత్తం 23 పతకాలతో మెరిసింది. పోటీల చివరిరోజు ఫిబ్రవరి 14న భారత్ ఖాతాలో 2 స్వర్ణాలు, 3 రజతాలు, 1 కాంస్యంతో కలిపి మొత్తం 6 పతకాలు చేరాయి. ఈ టోర్నీలో థాయ్‌లాండ్ 34 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది.
హైజంప్‌లో...
హైజంప్ ఈవెంట్‌లో భారత టీనేజీ అథ్లెట్లు ప్రవీణ్ కుమార్ (ఎఫ్42/44/64), నిశాద్ కుమార్ (టి46/47) చెరో స్వర్ణం నెగ్గడంతోపాటు వారి కేటగిరీల్లో ఆసియా రికార్డులను నెలకొల్పారు. ప్రవీణ్ 2.05 మీటర్లు జంప్ చేసి కొత్త ఆసియా రికార్డు అందుకున్నాడు. నిశాద్ (2.06 మీటర్లు) అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శనతో పసిడి పతకాన్ని సాధించాడు.

Published date : 15 Feb 2021 05:57PM