ఫియట్ క్రిస్లర్, పియాజియోల విలీనం
Sakshi Education
వాహన రంగంలోని రెండు దిగ్గజ కంపెనీలు ‘‘ఫియట్ క్రిస్లర్, పీఎస్‌ఏ పియాజియో’’ విలీనానికి ఆయా కంపెనీల వాటాదారులు జనవరి 4న ఆమోదాలు తెలిపారు.
ఈ రెండు కంపెనీల విలీనంతో ఏర్పడే కంపెనీని ‘‘స్టెల్లాంటియస్’’ పేరుతో వ్యవహరిస్తారు. ఈ కంపెనీ వార్షిక కార్ల ఉత్పత్తి సామర్థ్యం 87 లక్షలు. ప్రపంచంలోనే అతి పెద్ద నాలుగో వాహన కంపెనీ ఇదే కానున్నది. టయోటా, ఫోక్స్‌వ్యాగన్, రెనాల్ట్-నిస్సాన్‌ల తర్వాతి స్థానం ఇక నుంచి స్టెల్లాంటియస్‌దే. ఈ కంపెనీకి సీఈఓగా పీఎస్‌ఏ పియాజియో సీఈఓ కార్లోస్ తవరెస్, చైర్మన్‌గా ఫియట్ క్రిస్లర్ చైర్మన్ జాన్ ఈల్‌కాన్‌లు వ్యవహరిస్తారు.
Published date : 05 Jan 2021 06:08PM