ఫిట్ ఇండియా మూవ్‌మెంట్ ప్రారంభం
Sakshi Education
ఫిట్‌నెస్‌పై అవగాహన పెంచడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ‘ఫిట్ ఇండియా మూవ్‌మెంట్’ను మొదలు పెట్టింది.
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆగస్టు 29న ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ దేశంలో ప్రతీ ఒక్కరు ఆరోగ్య పరిరక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు. ఫిట్‌నెస్ అనేది సున్నా శాతం పెట్టుబడి పెడితే వంద శాతం ఫలితాలు ఇచ్చేదన్నారు.
ఫిట్ ఇండియా మూవ్‌మెంట్‌ను నిరంతరాయంగా కొనసాగించేందుకు కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలో 28 మంది సభ్యుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫిట్ ఇండియా మూవ్‌మెంట్ ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 29
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ఫిట్‌నెస్‌పై అవగాహన పెంచడంలో భాగంగా

Published date : 30 Aug 2019 05:17PM