Skip to main content

ఫిఫా కౌన్సిల్ సభ్యుడిగా ప్రఫుల్ పటేల్

ఫిఫా కౌన్సిల్ సభ్యుడిగా అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ ఎన్నికయ్యారు.
దీంతో భారత్‌నుంచి ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా పటేల్ గుర్తింపు పొందారు. మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో ఏప్రిల్ 6న జరిగిన ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఎఫ్‌సీ) కాంగ్రెస్‌లో ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్‌ఫ్యాంటినో ఈ మేరకు ప్రకటించారు. పటేల్‌తోపాటు మరో నలుగురు వచ్చే నాలుగేళ్ల పాటు సభ్యులుగా కొనసాగనున్నారు. మరోవైపు ఏఎఫ్‌సీ అధ్యక్షుడిగా షేక్ సల్మాన్ బిన్ ఇబ్రహీం అల్ ఖలీఫా వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఫిఫా కౌన్సిల్ సభ్యుడిగా ఏఐఎఫ్‌ఎఫ్ అధ్యక్షుడు ఎన్నిక
ఎప్పుడు : ఏప్రిల్ 6
ఎవరు : ప్రఫుల్ పటేల్
Published date : 08 Apr 2019 04:57PM

Photo Stories