ఫిలిప్ ఐలాండ్ టెన్నిస్ టోర్నిలో టైటిల్ గెలిచిన క్రీడాకారిణి?
Sakshi Education
భారత మహిళల నంబర్వన్ టెన్నిస్ క్రీడాకారిణి అంకిత రైనా తన కెరీర్లో తొలి డబ్ల్యూటీఏ టైటిల్‌ను సాధించింది.
ఫిలిప్ ఐలాండ్ ట్రోఫీ మహిళల డబుల్స్ విభాగంలో అంకిత తన రష్యా భాగస్వామి కమిల్లా రఖీమోవాతో కలిసి విజేతగా నిలిచింది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఫిబ్రవరి 19న జరిగిన డబుల్స్ ఫైనల్లో అంకిత (భారత్)–కమిల్లా (రష్యా) ద్వయం 2–6, 6–4, 10–7తో అనా బ్లింకోవా–అనస్టాసియా పొటపోవా (రష్యా) జోడీపై గెలుపొందింది. టైటిల్ గెలుపొందిన అంకిత జోడీకి 8000 డాలర్లు ప్రైజ్‌మనీగా లభించాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫిలిప్ ఐలాండ్ ట్రోఫీలో మహిళల డబుల్స్ టైటిల్ విజేత
ఎప్పుడు : ఫిబ్రవరి 19
ఎవరు : అంకిత రైనా (భారత్)–కమిల్లా రఖీమోవా(రష్యా) ద్వయం
ఎక్కడ : మెల్‌బోర్న్, ఆస్ట్రేలియా
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫిలిప్ ఐలాండ్ ట్రోఫీలో మహిళల డబుల్స్ టైటిల్ విజేత
ఎప్పుడు : ఫిబ్రవరి 19
ఎవరు : అంకిత రైనా (భారత్)–కమిల్లా రఖీమోవా(రష్యా) ద్వయం
ఎక్కడ : మెల్‌బోర్న్, ఆస్ట్రేలియా
Published date : 25 Feb 2021 02:39PM