Skip to main content

ఫేస్‌బుక్‌కు ఐసీసీ డిజిటల్ హక్కులు

భారత ఉపఖండంలో జరిగే క్రికెట్ మ్యాచ్‌లకు సంబంధించిన డిజిటల్ కంటెంట్ హక్కులను ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ఫేస్‌బుక్ దక్కించుకుంది.
ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)తో ఫేస్‌బుక్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని ఐసీసీ సెప్టెంబర్ 26న వెల్లడించింది. 2023 వరకు ఈ భాగస్వామ్య ఒప్పందం కొనసాగుతుందని తెలిపింది. ఈ ఒప్పందం ప్రకారం డిజిటల్ హక్కులతో పాటు మ్యాచ్ పున:ప్రసారాలు, క్రికెట్‌కు సంబంధించిన కథనాలను ఫేస్‌బుక్ ప్రేక్షకులకు అందించనుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఫేస్‌బుక్‌కు ఐసీసీ డిజిటల్ హక్కులు
ఎప్పుడు : సెప్టెంబర్ 26
ఎవరు : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)
ఎక్కడ : భారత్‌లో జరిగే క్రికెట్ మ్యాచ్‌లకు సంబంధించి
Published date : 27 Sep 2019 05:22PM

Photo Stories