Skip to main content

ఫార్ములావన్ నుంచి వైదొలుగనున్నట్లు ప్రకటించిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ?

అంతర్జాతీయ ఆటోమొబైల్ సమాఖ్య (ఎఫ్‌ఐఏ)-ఫార్ములావన్ నుంచి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ‘హోండా’ వైదొలగనుంది.
Current Affairs
ప్రఖ్యాత రెడ్‌బుల్, ఆల్ఫాటౌరీ జట్లకు ఇంజిన్లను సరఫరా చేస్తోన్న జపాన్ కంపెనీ హోండా... 2021 సీజన్ ముగింపు నాటికి ఫార్ములావన్ (ఎఫ్1) నుంచి వైదొలగనున్నట్లు అక్టోబర్ 2న ప్రకటించింది. పర్యావరణానికి కీలకమైన ‘కార్బన్ న్యూట్రాలిటీ’ని 2050 నాటికి సాధించాలనే లక్ష్యానికి కట్టుబడినందువల్లే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టకహిరో హాచిగో వెల్లడించారు.

ఏథెన్స్ మారథాన్ రద్దు
కరోనా వైరస్ విజృంభణ కారణంగా.. ఎంతో చరిత్ర ఉన్న ఏథెన్స్ మారథాన్‌ను 2020 ఏడాది నిర్వహించడం లేదని గీస్ ట్రాక్ సమాఖ్య (జీటీఎఫ్) తెలిపింది. షేడ్యూల్ ప్రకారం నవంబర్ 8న ఈ పరుగు జరగాల్సి ఉంది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఫార్ములావన్ నుంచి వైదొలగనున్నట్లు ప్రకటన
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : జపాన్ కంపెనీ హోండా
ఎందుకు : పర్యావరణానికి కీలకమైన ‘కార్బన్ న్యూట్రాలిటీ’ని 2050 నాటికి సాధించాలని
Published date : 03 Oct 2020 06:05PM

Photo Stories