Skip to main content

ఫాల్కన్ హెవీ రాకెట్ ప్రయోగం విజయవంతం

అమెరికాలోని కేప్ కెనవెరాల్‌లోగల కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ ఎక్స్ సంస్థ జూన్ 25న చేపట్టిన ఫాల్కన్ హెవీ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది.
ఈ రాకెట్ ద్వారా 24 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించారు. డీప్‌స్పేస్ అటామిక్ క్లాక్, సౌర తెరచాప, హరిత ఇంధనాన్ని పరీక్షించే వ్యవస్థ అందులో ఉన్నాయి. మానవ అస్థికలను కూడా ఈ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపారు. సౌరకాంతితో నడిచే వ్యోమనౌకగా ఇందులోని తెరచాప రికార్డు నెలకొల్పింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఫాల్కన్ హెవీ రాకెట్ ప్రయోగం విజయవంతం
ఎప్పుడు : జూన్ 25
ఎవరు : స్పేస్ ఎక్స్ సంస్థ
ఎక్కడ : కెన్నడీ అంతరిక్ష కేంద్రం, కేప్ కెనవెరాల్, అమెరికా
Published date : 26 Jun 2019 06:13PM

Photo Stories