పురుషుల 200 మీటర్లలో స్వర్ణం గెలిచిన క్రీడాకారుడు?
Sakshi Education
టోక్యో ఒలింపిక్స్–2020 పురుషుల 200 మీటర్ల పరుగులో కెనడా అథ్లెట్ ఆండ్రీ డి గ్రాసీ విజేతగా నిలిచాడు.
2021, ఆగస్టు 4న జరిగిన పురుషుల 200 మీటర్ల పరుగులో 19.62 సెకన్లలో గమ్యానికి చేరి బంగారు పతకాన్ని సాధించాడు. ఒలింపిక్స్‌ల్లో గ్రాసీకిది ఐదో పతకం. 2016 ‘రియో’లో 100 మీటర్లు, 4్ఠ100 మీటర్ల టీమ్ రిలేలో కాంస్యాలను... 200 మీటర్ల పరుగులో రజతాన్ని దక్కించుకున్నాడు. తాజా ఒలింపిక్స్‌లో ఇప్పటికే 100 మీటర్ల పరుగులో కాంస్యాన్ని నెగ్గాడు. గ్రాసీ తర్వాత 19.68 సెకన్లలో గమ్యాన్ని చేరిన కెనెత్ బెడ్నారెక్ (అమెరికా–19.68 సెకన్లు) రజతం... నోవా లైలెస్ (అమెరికా–19.74 సెకన్లు) కాంస్యం సాధించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : టోక్యో ఒలింపిక్స్–2020 పురుషుల 200 మీటర్లలో స్వర్ణం గెలిచిన క్రీడాకారుడు?
ఎప్పుడు : ఆగస్టు 4, 2021
ఎవరు : కెనడా అథ్లెట్ ఆండ్రీ డి గ్రాసీ
ఎక్కడ : టోక్యో, జపాన్
క్విక్ రివ్యూ :
ఏమిటి : టోక్యో ఒలింపిక్స్–2020 పురుషుల 200 మీటర్లలో స్వర్ణం గెలిచిన క్రీడాకారుడు?
ఎప్పుడు : ఆగస్టు 4, 2021
ఎవరు : కెనడా అథ్లెట్ ఆండ్రీ డి గ్రాసీ
ఎక్కడ : టోక్యో, జపాన్
Published date : 07 Aug 2021 12:43PM