పుల్వామా అమరుల స్మారక స్తూపం ఆవిష్కరణ
Sakshi Education
2019, ఫిబ్రవరి 14న పుల్వామా దాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 40 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది స్మృత్యర్థం లెత్‌పోరా సైనిక శిబిరంలో స్మారక స్తూపాన్ని ఆవిష్కరించారు.
సీఆర్‌పీఎఫ్ జవాన్ల సేవ, నిజాయితీలకు గుర్తుగా 2020, ఫిబ్రవరి 14న ఈ స్థూపాన్ని ఆవిష్కరించారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన 40 మంది జవాన్ల ఫొటోలను వారి పేర్లతో సహా ఆ స్తూపంపై చెక్కారు.
మీ బలిదానాన్ని మరువలేం: ప్రధాని
‘పుల్వామా’అమరవీరులకు ఫిబ్రవరి 14న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు. దేశ రక్షణ కోసం జీవితాన్ని అంకితం చేసి, చివరికి ప్రాణత్యాగం చేసిన వారికి సాటి, పోటీ ఎవరూ లేరని కొనియాడారు. భారతీయులు ఎన్నటికీ ఆ వీర సైనికుల బలిదానాన్ని మరువలేరని మోదీ ట్వీట్ చేశారు.
2019 పుల్వామా దాడి
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవంతిపొరా పట్టణం సమీపంలోని లెత్‌పొరా వద్ద సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు 2019, ఫిబ్రవరి 14న ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఓ స్కార్పియో ఎస్‌యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకున్న ఓ ఆత్మాహుతి దళసభ్యుడు జవాన్ల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకున్నాడు. తన కారుతో కాన్వాయ్‌లోని ఓ బస్సును ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీర మరణం పొందగా, మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా సీఆర్పీఎఫ్ 76వ బెటాలియన్‌కు చెందిన వారు. ఈ దాడిని తామే చేశామని పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రసంస్థ జైషే మహమ్మద్ ప్రకటించుకుంది.

Published date : 15 Feb 2020 05:52PM