పట్నా మెట్రోరైల్ పాజెక్టుకు శంకుస్థాపన
Sakshi Education
బిహార్ రాజధాని పట్నాలో రూ. 13 వేల కోట్లతో నిర్మించ తలపెట్టిన మెట్రోరైల్ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 17న రిమోట్ ద్వారా శంకుస్థాపన చేశారు.
అలాగే జార్ఖండ్‌లోని డుంకా, పాలము, హజారీబాగ్‌ల్లో వైద్య కళాశాలలను కూడా మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిపై దేశ ప్రజల గుండెలు రగులుతున్నట్లుగానే తన హృదయం కూడా కోపం, విషాదంతో నిండిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పట్నా మెట్రోరైల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన
ఎప్పుడు : ఫిబ్రవరి 17
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : పట్నా, బిహార్
క్విక్ రివ్యూ :
ఏమిటి : పట్నా మెట్రోరైల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన
ఎప్పుడు : ఫిబ్రవరి 17
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : పట్నా, బిహార్
Published date : 18 Feb 2019 05:44PM