Skip to main content

{పశాంత్ కిషోర్‌పై జేడీయూ వేటు

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా రిజిస్టర్(ఎన్‌పీఆర్) విషయంలో పార్టీ వైఖరిని ప్రశ్నించినందుకు పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్‌ను జనతాదళ్(యూ) బహిష్కరించింది. సీఏఏ, ఎన్‌పీఆర్‌లను వ్యతిరేకిస్తున్న కిషోర్...
Current Affairsఈ విషయంలో పార్టీ వైఖరిని తప్పుబడుతున్నారు. నితీశ్ ఈ రెండింటికీ మద్దతివ్వటాన్ని ప్రశాంత్‌తో పాటు జేడీ(యూ) ప్రధాన కార్యదర్శి పవన్ వర్మ విమర్శించారు. ఈ రెండింటికీ వ్యతిరేకంగా విపక్షాలు ఒక్కటవ్వాలని ప్రశాంత్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పార్టీనుంచి వారిద్దరినీ బహిష్కరిస్తున్నట్లు జేడీయూ తెలిపింది. ‘వారిద్దరూ సీఎంను అవమానించేలా మాట్లాడారు. పార్టీ క్రమశిక్షణను అతిక్రమించారు’ అని పార్టీ పేర్కొంది. పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి, పార్టీ పదవుల నుంచి తక్షణమే అమల్లోకి వచ్చేలా ప్రశాంత్ కిషోర్, పవన్ వర్మలను బహిష్కరిస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు.

క్విక్ రివ్యూ:
ఏమిటి:
జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్‌ను పార్టీ నుంచి బహిష్కరణ
ఎప్పుడు: జనవరి 29, 2020
ఎవరు: {పశాంత్ కిషోర్
ఎందుకు: సీఏఏ, ఎన్‌పీఆర్‌ల విషయంలో.. పార్టీ వైఖరిని తప్పుబడుతున్నాడని...
Published date : 30 Jan 2020 06:04PM

Photo Stories