ప్రత్యేక హోదాపై ప్రధానికి ఏపీ సీఎం జగన్ లేఖ
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫిబ్రవరి 4న లేఖ రాశారు.
ఏపీ ప్రత్యేక హోదా అంశం తమ పరిధిలో లేదని, దీనిపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని 15వ ఆర్థిక సంఘం స్పష్టం చేసినందున రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని సీఎం తన లేఖలో పేర్కొన్నారు. విభజనతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవడానికి 2020-21 బడ్జెట్‌లో కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా కల్పించే విషయం పూర్తిగా కేంద్రం పరిధిలోనే ఉన్నందున అన్ని విధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలన్నారు.
రాజధాని నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే
రాష్ట్ర రాజధాని అంశంలో నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలనే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదేనని కేంద్ర హోంశాఖ తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌రాయ్ లోక్‌సభకు ఫిబ్రవరి 4న లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏపీకి ప్రత్యేక హోదా కల్పించే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ
ఎప్పుడు : ఫిబ్రవరి 4
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

Published date : 05 Feb 2020 05:49PM