Skip to main content

ప్రత్యేక హోదాపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఐదు కోట్ల మంది ప్రజల తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జూన్ 18న శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ప్రత్యేక హోదా తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. విభజనతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడంతోపాటు ఉపాధి అవకాశాలు లేక నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వల్లే కొంతైనా ఊరట లభిస్తుందని జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ శాసనమండలిలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ప్రత్యేక హోదాపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం
ఎప్పుడు : జూన్ 18
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
Published date : 19 Jun 2019 06:07PM

Photo Stories