Skip to main content

ప్రతి 4 నిమిషాలకో..నిండు ప్రాణం: కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ

సాక్షి, అమరావతి: రహదారులపై మృత్యు ఘంటికలు మోగుతున్నాయి! రోడ్డు ప్రమాదాల కారణంగా దేశంలో సగటున ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు ప్రాణాలు కోల్పోతుండగా ఐదుగురు తీవ్రంగా గాయపడుతున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ నివేదిక వెల్లడించింది.
క్షతగాత్రుల్లో 30 శాతం మంది శాశ్వత వైకల్యానికి గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏటా 30 వేల నుంచి 40 వేల మంది రోడ్డు ప్రమాదాల కారణంగా వైకల్యం బారినపడుతున్నారు. దేశవ్యాప్తంగా ఏటా 5 లక్షల మంది వైకల్య బాధితుల జాబితాలో చేరుతున్నట్టు నివేదిక వెల్లడించింది.

3వ స్థానంలో ఉమ్మడి ఏపీ :
కేంద్ర ఆరోగ్యశాఖ నివేదిక ప్రకారం దేశంలో అత్యధిక ప్రమాదాలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో (2011 లెక్కల ప్రకారం) ఉంది. ఒక్క ఏడాదిలో 30 వేలకు పైగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా 8,200 మందికి పైగా మృతి చెందారు. ఇది దేశవ్యాప్తంగా ప్రమాదాల సగటులో 7.52 శాతం. ఏపీలో బోధనాసుపత్రులకు ఏటా సగటున 14 వేల మంది ప్రమాద బాధితులు చికిత్స కోసం వస్తున్నారు. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్క ఏడాదిలో 24,914 మంది ప్రమాద బాధితులు వచ్చినట్టు నమోదైంది.

నివేదికలో మరికొన్ని అంశాలివీ..
  • ప్రతి పదేళ్లకు 50 లక్షల మంది అంటే ఏటా 5 లక్షల మంది రకరకాల ప్రమాదాలు, ఇతర కారణాల వల్ల శాశ్వత వైకల్యం బారిన పడుతున్నారు.
  • బాధితుల్లో 10-19 ఏళ్ల లోపువారే ఎక్కువగా 46.16 లక్షలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
  • 20-29 ఏళ్ల లోపు వారు 41.89 లక్షల మంది, 30-39 ఏళ్ల లోపు వారు 36.35 లక్షల మంది, 40-49 ఏళ్ల లోపు వారు 31.15 లక్షల మంది వైకల్య బాధితుల జాబితాలో ఉన్నారు.
  • ప్రమాదం జరిగిన తొలి గంట లోపే వైద్యచికిత్స అందిస్తే వైకల్యం బారి నుంచి కాపాడవచ్చు. ట్రామాకేర్ సెంటర్ల ఏర్పాటు ద్వారా ప్రమాదల తీవ్రతను తగ్గించవచ్చు.

ప్రధాన రాష్ట్రాల్లో వైకల్య బాధితులు..

ఉత్తరప్రదేశ్

41,57,514

మహారాష్ట్ర

29,63,392

బిహార్

23,31,009

ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి)

22,66,607

పశ్చిమ బెంగాల్

20,17,406

రాజస్థాన్

15,63,694

మధ్యప్రదేశ్

15,51,931

కర్నాటక

13,24,205

ఒడిశా

12,44,402

తమిళనాడు

11,79,963

గుజరాత్

10,92,302

కేరళ

7,61,743


క్విక్ రివ్యూ:
ఏమిటి: ప్రతి 4 నిమిషాలకో నిండు ప్రాణం బలి
ఎందుకు: రోడ్డు ప్రమాదాల కారణంగా
ఎక్కడ: భారతదేశం
Published date : 18 Nov 2019 05:55PM

Photo Stories