Skip to main content

ప్రస్తుతం ఎఫ్ఏటీఎఫ్ అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారు?

ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందిస్తున్నందుకు గాను పాకిస్తాన్‌ను గ్రే లిస్టులో కొనసాగిస్తున్నట్టుగా ది ఫైనాన్సియల్‌ యాక్షన్‌ టాక్స్‌ ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) జూన్‌ 25న ప్రకటించింది.
Current Affairs
తామిచ్చిన టాస్క్‌లన్నీ పూర్తి చేయనందుకు గాను పాక్‌ను గ్రే లిస్టులోనే ఉంచుతున్నట్టుగా ఎఫ్‌ఏటీఎఫ్‌ స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని కట్టడి చేయడంలో పాక్‌ ఇకనైనా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ఎఫ్‌ఏటీఎఫ్‌ అధ్యక్షుడు మార్కస్‌ ప్లేయెర్‌ హితవు పలికారు. ప్రపంచవ్యాప్తంగా మనీ లాండరింగ్, ఉగ్రవాదులకు ఆర్థిక సాయంపై ఓ కన్నేసి ఉంచే ఎఫ్‌ఏటీఎఫ్‌ సంస్థ పారిస్‌ కేంద్రంగా పనిచేస్తోంది.

పీఎస్‌ఎల్‌ టి20 టోర్నీలో విజేతగా నిలిచిన జట్టు?
పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌) టి20 టోర్నమెంట్‌లో ముల్తాన్‌ సుల్తాన్స్‌ జట్టు తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. 2017 విజేత పెషావర్‌ జల్మీ జట్టుతో యూఏఈ రాజధాని అబుదాబిలో జూన్‌ 28న జరిగిన ఫైనల్లో ముల్తాన్‌ సుల్తాన్స్‌ జట్టు 47 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : పాకిస్తాన్‌ను గ్రే లిస్టులో కొనసాగిస్తున్నాం
ఎప్పుడు : జూన్‌ 25
ఎవరు : ది ఫైనాన్సియల్‌ యాక్షన్‌ టాక్స్‌ ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌)
ఎందుకు : ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందిస్తున్నందుకు గాను
Published date : 29 Jun 2021 06:23PM

Photo Stories