ప్రపంచంలోనే తొలి డబుల్ డెక్కర్ కంటైనర్ రైలు ఎక్కడ ప్రారంభమైంది?
Sakshi Education
న్యూ రెవారీ(హరియాణా)-న్యూ మదార్(రాజస్థాన్) రైలు మార్గంలో 306 కిలోమీటర్ల ప్రత్యేక సరకు రవాణా కారిడార్‌ను ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 7న జాతికి అంకితం చేశారు.
అలాగే ప్రపంచంలోనే తొలి డబుల్ స్టాక్ డెక్కర్ కంటైనర్ రైలును కూడా జెండా ఊపి ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్‌స ద్వారా ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం మోదీ ప్రసంగించారు. విద్యుత్‌తో నడిచే 1.5 కిలోమీటర్ల పొడవైన ఈ డబుల్ డెక్కర్ రైలు హరియాణాలోని న్యూ అటేలీ నుంచి రాజస్తాన్‌లోని న్యూకిషన్‌గఢ్ వరకు ప్రయాణిస్తుంది.
ప్రధాని ప్రసంగం-ముఖ్యాంశాలు
- దేశంలో మౌలిక సదుపాయాలను ఆధునీకరించే మహాయజ్ఞం(మిషన్) వేగం పుంజుకుంది.
- దేశంలో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కడానికి రైల్వే సరుకు రవాణా కారిడార్లు ఎంతగానో దోహదపడతాయి.
- న్యూ రెవారీ-న్యూ మదార్ పశ్చిమ రైల్వే సరుకు రవాణా కారిడార్ 9 రాష్ట్రాల్లోని 133 రైల్వే స్టేషన్లను అనుసంధానిస్తుంది.
- పశ్చిమ రైల్వే సరుకు రవాణా కారిడార్‌తో హరియాణా, రాజస్తాన్‌తో పాటు దేశ రాజధాని ఢిల్లీలో పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, రైతులకు నూతన అవకాశాలు అందుబాటులోకి వస్తాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచంలోనే తొలి డబుల్ డెక్కర్ కంటైనర్ రైలు ప్రారంభం
ఎప్పుడు : జనవరి 7
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : హరియాణాలోని న్యూ అటేలీ, రాజస్తాన్‌లోని న్యూకిషన్‌గఢ్ మధ్య
Published date : 08 Jan 2021 06:37PM