Skip to main content

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక శక్తిని కలిగిన దేశం?

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక శక్తిని కలిగిన దేశంగా చైనా నిలిచింది.
Current Affairs
చైనా తర్వాత రెండో స్థానంలో అమెరికా, మూడో స్థానంలో రష్యా, నాలుగో స్థానంలో భారత్‌ నిలిచాయి. మిలటరీ డైరెక్ట్‌ అనే డిఫెన్స్‌ వెబ్‌సైట్‌ మార్చి 21న విడుదల చేసిన 'అల్టిమేట్‌ మిలటరీ స్ట్రెన్త్‌ ఇండెక్స్‌' ద్వారా ఈ విషయం వెల్లడైంది. మిలటరీ బడ్జెట్, యాక్టివ్, ఇన్‌ యాక్టివ్‌ సైనికుల సంఖ్య, త్రివిధ దళాలు, అణు సామర్థ్యం, సరాసరి వేతనాలు, ఆయుధ సామగ్రి వంటి వివరాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఇండెక్స్‌ను రూపొందించారు.

82 పాయింట్లతో...
మొత్తం 100 పాయింట్లకు చైనా 82 పాయింట్లతో మిలటరీ స్ట్రెన్త్‌ ఇండెక్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. అమెరికా మిలటరీ బడ్జెట్‌ భారీగా ఉన్నప్పటికీ.. 74 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. తర్వాత 69 పాయింట్లతో రష్యా మూడో స్థానంలో, 61 పాయింట్లతో భారత్‌ నాలుగో స్థానంలో ఉన్నాయి. ఈ ఇండెక్స్‌లో యూకే 43 పాయింట్లతో 9వ స్థానంలో నిలిచింది.

బడ్జెట్‌లో అమెరికాకు అగ్రస్థానం...
ప్రపంచంలోనే భారీ మిలటరీ బడ్జెట్‌ను కలిగిన అమెరికా ఏడాదికి 732 బిలియన్‌ డాలర్లను వెచ్చిస్తుండగా చైనా 261 బిలియన్‌ డాలర్లు, భారత్‌ 71 బిలియన్‌ డాలర్లు ఖర్చు పెడుతున్నాయి.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి :
అత్యంత శక్తివంతమైన సైనిక శక్తిని కలిగిన దేశం చైనా
ఎప్పుడు : మార్చి 21
ఎవరు : అల్టిమేట్‌ మిలటరీ స్ట్రెన్త్‌ ఇండెక్స్‌(మిలటరీ డైరెక్ట్‌)
ఎక్కడ : ప్రపంచంలోనే
Published date : 22 Mar 2021 05:59PM

Photo Stories