Skip to main content

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియం ప్రారంభం

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ మైదానం నరేంద్ర మోదీ క్రికెట్‌ స్టేడియం(మెతెరా స్టేడియం) ప్రారంభమైంది.
Current Affairsభారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఫిబ్రవరి 24న ఈ స్టేడియాన్ని ప్రారంభించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న ''ది సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ స్పోర్ట్స్‌ ఎన్‌క్లేవ్‌''లో ఈ ఉన్న ఈ స్టేడియాన్ని మొతెరా స్టేడియం అని పిలిచేవారు. తాజా దీనికి 'నరేంద్ర మోదీ స్టేడియం'గా నామకరణం చేశారు. స్టేడియంలోని రెండు ఎండ్‌లకు కార్పొరేట్‌ సంస్థలైన రిలయన్స్, అదానీల పేర్లు పెట్టారు. రూ.800 కోట్లు ఖర్చుతో ఆస్ట్రేలియాకు చెందిన పాపులస్‌ సంస్థ దీన్ని నిర్మించింది. ఈ మైదానంలో 1.32 లక్షల మంది ప్రేక్షకులు కూర్చునే వీలుంది.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియం ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 24
ఎవరు : భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌
ఎక్కడ : అహ్మదాబాద్, గుజరాత్‌
Published date : 27 Feb 2021 06:46PM

Photo Stories