ప్రపంచకప్ షూటింగ్‌లో అభిషేక్‌కు స్వర్ణం
Sakshi Education
ప్రపంచకప్ షూటింగ్‌లో భారత షూటర్ అభిషేక్ వర్మకు స్వర్ణ పతకం లభించింది.
బ్రెజిల్‌లోని రియో డి జెనీరోలో ఆగస్టు 29న(భారత కాలమానం ప్రకారం) జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్ విభాగం ఫైనల్లో అభిషేక్ 244.2 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి పసిడి కైవసం చేసుకున్నాడు. ఇదే విభాగంలో ఫైనల్‌కు చేరిన మరో భారత షూటర్ సౌరభ్ చౌదరి 221.9 పాయింట్లతో కాంస్యం నెగ్గాడు. రజత పతకాన్ని టర్కీ షూటర్ ఇస్మాయిల్ కెలెస్(243.1) చేజిక్కించుకున్నాడు. ప్రస్తుతం భారత్ 2 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యంతో పతకాల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచకప్ షూటింగ్‌లో భారత్‌కు స్వర్ణం
ఎప్పుడు : ఆగస్టు 29
ఎవరు : అభిషేక్ వర్మ
ఎక్కడ : రియో డి జెనీరో, బ్రెజిల్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచకప్ షూటింగ్‌లో భారత్‌కు స్వర్ణం
ఎప్పుడు : ఆగస్టు 29
ఎవరు : అభిషేక్ వర్మ
ఎక్కడ : రియో డి జెనీరో, బ్రెజిల్
Published date : 31 Aug 2019 05:36PM