ప్రపంచకప్ బాక్సింగ్ టోర్నీలో భారత్‌కు మూడు స్వర్ణాలు
ఇందులో మూడు స్వర్ణాలు, రెండు రజతాలు, నాలుగు కాంస్య పతకాలు ఉన్నాయి. పతకాల పట్టికలో భారత్ రెండో స్థానంలో నిలిచింది.
మూడు స్వర్ణాలు...
పురుషుల విభాగంలో అమిత్ పంఘాల్ (52 కేజీలు)... మహిళల విభాగంలో సిమ్రన్‌జిత్ కౌర్ (60 కేజీలు), మనీషా మౌన్ (57 కేజీలు) పసిడి పతకాలు సొంతం చేసుకున్నారు.
రెండు రజతాలు...
సాక్షి (57 కేజీలు), సతీష్ కుమార్ (91 కేజీ పైన) రజతం నెగ్గారు. 2-3తో మన దేశానికే చెందిన మనీషా చేతిలో సాక్షి ఓడిపోయింది. ప్లస్ 91 కేజీల విభాగంలో సతీశ్ కుమార్ గాయం కారణంగా బరిలోకి దిగలేదు. ఫైనల్లో సతీశ్ తన ప్రత్యర్థి నెల్వీ టియాఫాక్ (జర్మనీ)కి వాకోవర్ ఇచ్చాడు.
నాలుగు కాంస్యాలు...
సెమీఫైనల్లో ఓడిన సోనియా (57 కేజీలు), పూజా రాణి (75 కేజీలు), గౌరవ్ (57 కేజీలు), హుసాముద్దీన్ (57 కేజీలు) కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచకప్ బాక్సింగ్ టోర్నీలో స్వర్ణ పతకాలు సాధించిన భారతీయులు
ఎప్పుడు : డిసెంబర్ 20
ఎవరు : అమిత్ పంఘాల్ (52 కేజీలు), సిమ్రన్‌జిత్ కౌర్ (60 కేజీలు), మనీషా మౌన్ (57 కేజీలు)
ఎక్కడ : కొలోన్ పట్టణం, జర్మనీ