Skip to main content

ప్రపంచ సుస్థిరాభివృద్ధి సదస్సులో వెంకయ్య

న్యూఢిల్లీలో ఫిబ్రవరి 11న జరిగిన ప్రపంచ సుస్థిరాభివృద్ధి సదస్సు-2019 ప్రారంభ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. వాతావరణ మార్పుల తక్షణ ప్రభావాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలే ఎక్కువగా చూస్తున్నాయని అన్నారు. వ్యవసాయం, ఇతర అంశాల్లో ఎక్కువగా ప్రకృతి వనరులపై అధారపడడం, నవకల్పన విధానాలను పాటించే సామర్థ్యం తక్కువగా ఉండడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ప్రపంచ సుస్థిరాభివృద్ధి సదస్సు-2019 ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 11
ఎవరు : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 12 Feb 2019 05:01PM

Photo Stories