ప్రపంచ సంపన్నుల్లో ముకేశ్‌కు 12వ స్థానం
Sakshi Education
బ్లూమ్‌బర్గ్ సంస్థ డిసెంబర్ 24న విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితా-2019(బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్)లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 12వ స్థానంలో నిలిచారు.
ఈ జాబితా ప్రకారం 2019 ఏడాదిలో ముకేశ్ సంపద విలువ 16.5 బిలియన్ డాలర్ల మేర (సుమారు రూ. 1.2 లక్షల కోట్లు) పెరిగి... 60.8 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 4.3 లక్షల కోట్లు)కు చేరింది.
అగ్రస్థానంలో బిల్ గేట్స్..
బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ నిలిచాడు. బిల్ గేట్స్ సంపద 2019 ఏడాదిలో 22.4 బిలియన్ డాలర్లు పెరిగి 113 బిలియన్ డాలర్లకు చేరింది. రెండో స్థానంలో ఉన్న అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ సంపద మాత్రం 13.2 బిలియన్ డాలర్లు తగ్గింది. మరోవైపు, చైనాకు చెందిన ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా నికర విలువ 11.3 బిలియన్ డాలర్లు పెరిగింది. అత్యంత సంపన్నుల జాబితాలో ఆయన 19వ స్థానంలో ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ 2019లో 12వ స్థానం
ఎప్పుడు : డిసెంబర్ 24
ఎవరు : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ
ఎక్కడ : ప్రపంచంలో

Published date : 25 Dec 2019 05:53PM