Skip to main content

ప్రపంచ సంపన్నుల జాబితాలో ముకేశ్‌కు పదో స్థానం

ప్రపంచ సంపన్నుల జాబితాలో రిలయన్‌‌స ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 54 బిలియన్ డాలర్ల (రూ.3.83 లక్షల కోట్లు) సంపదతో మొదటిసారి పదో స్థానంలో నిలిచారు.
ఈ మేరకు ఫిబ్రవరి 26న ‘ద హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2019’ను హురున్ సంస్థ విడుదల చేసింది. ఈ జాబితాలో 147 బిలియన్ డాలర్ల సంపదతో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ వరుసగా రెండో ఏడాది మొదటి స్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్(96 బిలియన్ డాలర్లు), బెర్క్‌షైర్ హాత్‌వే చైర్మన్ వారెన్ బఫెట్(88 బిలియన్ డాలర్లు), ఎల్‌వీఎంహెచ్ బెర్నార్డ్ ఆర్నాల్డ్ (84 బిలియన్ డాలర్లు), ఫేస్‌బుక్ జుకెర్‌బర్గ్(80 బిలియన్ డాలర్లు) ఉన్నారు.

ఐదో స్థానానికి జారిన భారత్
2012 నుంచి చూస్తే భారత్ హురూన్ ప్రపంచ సంపన్నుల జాబితాలో ఐదో స్థానానికి దిగజారింది. రూపాయి బలహీనత, స్టాక్ మార్కెట్ కాంతిహీనంగా ఉండటం దీనికి కారణమని హురూన్ రిపోర్ట్ ఇండియా ఎండీ అనాస్ రెహ్మాన్ జునైద్ పేర్కొన్నారు. 2018తో పోలిస్తే 2019 ఏడాది జాబితాలో సంపన్నుల సంఖ్య 224 తగ్గి 2,470కు చేరింది. ఈ 2,470 మంది ఉమ్మడి సంపద విలువ 9.5 లక్షల కోట్ల డాలర్లు. ప్రపంచ జీడీపీలో 12%కి సమానం.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ద హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2019 లో పదో స్థానం
ఎప్పుడు : ఫిబ్రవరి 26
ఎవరు : ముకేశ్ అంబానీ
Published date : 27 Feb 2019 05:52PM

Photo Stories