ప్రపంచ ర్యాపిడ్ చెస్‌లో కోనేరు హంపికి స్వర్ణం
Sakshi Education
ప్రతిష్టాత్మక ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో భారత నంబర్‌వన్ మహిళా చెస్ క్రీడాకారిణి, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ (జీఎం) కోనేరు హంపి విశ్వవిజేతగా అవతరించింది.
తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చెస్ క్రీడాకారిణిగా కొత్త చరిత్ర సృష్టించింది. రష్యా రాజధాని మాస్కోలో డిసెంబర్ 29న ముగిసిన ఈ చాంపియన్‌షిప్‌లో హంపి మొరుగైన స్కోరుతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని సాధించింది. లీ టింగ్‌జి (చైనా) రజతం, అతాలిక్ ఎకతెరీనా (టర్కీ) కాంస్యం గెలుచుకున్నారు. మరోవైపు ఓపెన్ విభాగంలో మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే) విశ్వవిజేతగా నిలిచాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో స్వర్ణం
ఎప్పుడు : డిసెంబర్ 29
ఎవరు : కోనేరు హంపి
ఎక్కడ : మాస్కో, రష్యా
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో స్వర్ణం
ఎప్పుడు : డిసెంబర్ 29
ఎవరు : కోనేరు హంపి
ఎక్కడ : మాస్కో, రష్యా
Published date : 30 Dec 2019 06:08PM