ప్రపంచ దేశాలకు అందుబాటులో ‘కోవిన్’: ప్రధాని మోదీ
Sakshi Education
భారత్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్‌కు టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌గా ఉన్న ‘కోవిన్’ వెబ్‌సైట్/యాప్‌ను ఇక అన్ని దేశాలకు అందుబాటులో ఉండేలా ఓపెన్ సోర్సింగ్ చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు.
కరోనా మహమ్మారితో పోరాటంలో ప్రపంచ దేశాలకు సహకరించేందుకు భారత్ సదా సిద్ధంగా ఉంటుందన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కోవిన్ గ్లోబల్ కాంక్లేవ్‌నుద్దేశించి జూలై 5న ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘‘కోవిడ్ ట్రేసింగ్ అండ్ ట్రాకింగ్ యాప్ అయిన ‘కోవిన్’ సాఫ్ట్‌వేర్‌ను అందరికీ ఉచితంగా అందుబాటులో ఉండేలా ఓపెన్‌సోర్స్‌గా మారుస్తున్నాం’’ అని మోదీ అన్నారు.
కెనడా, మెక్సికో, నైజీరియా, పనామా, ఉగాండా తదితర దాదాపు 50 దేశాలు తమ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ‘కోవిన్’ను వినియోగించే విషయంపై ఆసక్తి కనబర్చాయని నేషనల్ హెల్త్ అథారిటీ సీఈఓ ఆర్‌ఎస్ శర్మ ఇటీవల తెలిపారు.
కెనడా, మెక్సికో, నైజీరియా, పనామా, ఉగాండా తదితర దాదాపు 50 దేశాలు తమ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ‘కోవిన్’ను వినియోగించే విషయంపై ఆసక్తి కనబర్చాయని నేషనల్ హెల్త్ అథారిటీ సీఈఓ ఆర్‌ఎస్ శర్మ ఇటీవల తెలిపారు.
Published date : 06 Jul 2021 06:35PM