ప్రపంచ చెస్‌లో స్వర్ణ పతకాలు నెగ్గిన భారతీయ క్రీడాకారులు?
Sakshi Education
ప్రపంచ యూత్ ర్యాపిడ్ చెస్ ఆన్‌లైన్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మూడు స్వర్ణ పతకాలు లభించాయి.
అండర్-18 ఓపెన్ విభాగంలో గ్రాండ్‌మాస్టర్ నిహాల్ సరీన్ (కేరళ), అండర్-14 ఓపెన్ విభాగంలో గ్రాండ్‌మాస్టర్ డి.గుకేశ్ (తమిళనాడు), అండర్-16 బాలికల విభాగంలో రక్షిత రవి (తమిళనాడు) చాంపియన్స్ గా నిలిచి స్వర్ణాలు గెలిచారు. డిసెంబర్ 22న జరిగిన ఫైనల్స్‌లో నిహాల్ సరీన్ 1.5-0.5తో షాంట్ సర్గాసియాన్ (అర్మేనియా)పై... గుకేశ్ 2-1తో వొలోడార్ ముర్జిన్ (రష్యా)పై... రక్షిత 1.5-0.5తో యుజిన్ సాంగ్ (చైనా)పై గెలిచారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ యూత్ ర్యాపిడ్ చెస్ ఆన్‌లైన్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన భారతీయులు
ఎప్పుడు : డిసెంబర్ 22
ఎవరు : నిహాల్ సరీన్, డి.గుకేశ్, రక్షిత రవి
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ యూత్ ర్యాపిడ్ చెస్ ఆన్‌లైన్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన భారతీయులు
ఎప్పుడు : డిసెంబర్ 22
ఎవరు : నిహాల్ సరీన్, డి.గుకేశ్, రక్షిత రవి
Published date : 23 Dec 2020 06:08PM