Skip to main content

ప్రపంచ ఆయుర్వేద కేంద్రాన్ని డబ్ల్యూహెచ్‌వో ఏ దేశంలో ఏర్పాటు చేయనుంది?

జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద (ఐటీఆర్‌ఏ), రాజస్తాన్‌లోని జైపూర్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఎన్‌ఐఏ)లను నవంబర్ 13న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
Current Affairs
ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డెరైక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రేసియస్ ఒక వీడియో సందేశాన్ని పంపించారు.

టెడ్రోస్ సందేశం...
‘‘సంప్రదాయ వైద్యాన్ని పటిష్టం చేయడానికి, దానిపై విస్తృతంగా పరిశోధనలు నిర్వహించి అందరిలోనూ అవగాహన కల్పించడానికి భారత్‌లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఆయుర్వేద కేంద్రాన్ని నెలకొల్పబోతున్నాం. అన్ని దేశాల్లోనూ సంప్రదాయ వైద్య విధానాలకు మహర్దశ తీసుకురావడంలో భాగంగానే ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నాం’’ అని టెడ్రోస్ తన సందేశంలో పేర్కొన్నారు.

జాతీయ ఆయుర్వేద దినోత్సవం...
ఆయుర్వేద వైద్య మూలపురుషుడు ధన్వంతరి జయంతి రోజున(ధన్‌తేరస్) ప్రతి ఏడాది ‘‘జాతీయ ఆయుర్వేద దినోత్సవం’’ను నిర్వహిస్తున్నారు. 2016 నుంచి ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నారు. 2020 ఏడాదిలో నవంబర్ 13వ తేదీన ఈ దినోత్సవం జరిగింది. ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం దన్వంతరి జయంతి ఒక్కో ఏడాది ఒక్కో తేదీలో రావచ్చు. అందువల్ల ఈ దినోత్సవాన్ని ఏటా ఒకే తేదీన పాటించరు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ప్రపంచ ఆయుర్వేద కేంద్రం ఏర్పాటు
ఎప్పుడు : నవంబర్ 13
ఎవరు : డబ్ల్యూహెచ్‌వో డెరైక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రేసియస్
ఎక్కడ : భారత్
ఎందుకు : సంప్రదాయ వైద్యాన్ని పటిష్టం చేయడానికి, దానిపై విసృ్తతంగా పరిశోధనలు నిర్వహించి అందరిలోనూ అవగాహన కల్పించడానికి
Published date : 16 Nov 2020 05:41PM

Photo Stories