ప్రపంచ అథ్లెటిక్స్‌లో నియా అలీకి స్వర్ణం
Sakshi Education
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో అమెరికా అథ్లెట్ నియా అలీ స్వర్ణం సాధించింది.
ఖతర్ రాజధాని దోహాలో అక్టోబర్ 6న జరిగిన ఈ ఈవెంట్‌లో నియా 12.34 సెకన్లలో గమ్యానికి చేరి తొలిసారి విశ్వవిజేతగా అవతరించింది. 30 ఏళ్ల నియాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరోవైపు మహిళల లాంగ్‌జంప్‌లో మలైకా మిహాంబో (జర్మనీ-7.30 మీటర్లు)... పురుషుల 1500 మీటర్లలో టిమోతీ చెరుయోట్ (కెన్యా-3ని:29.26 సెకన్లు) పసిడి పతకాలు సాధించారు.
అదేవిధంగా పురుషుల జావెలిన్ త్రోలో పీటర్స్ (గ్రెనెడా-86.89 మీటర్లు)... పురుషుల 10,000 మీటర్లలో జోషువా చెప్‌టెగి (ఉగాండా-26ని:48.36 సెకన్లు)... మహిళల 4X400 మీటర్ల రిలే ఫైనల్స్‌లో అమెరికా బృందం (3ని:18.92 సెకన్లు)... పురుషుల 4X400 మీటర్ల రిలే ఫైనల్స్‌లో అమెరికా బృందం (2ని:56.69 సెకన్లు) స్వర్ణ పతకాలు గెల్చుకున్నారు. ఓవరాల్‌గా పతకాల పట్టికలో అమెరికా 14 స్వర్ణాలు, 11 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి 29 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. ఈసారి కూడా భారత జట్టు రిక్తహస్తాలతో ప్రపంచ చాంపియన్‌షిప్స్‌ను ముగించింది. ప్రపంచ చాంపియన్‌షిప్స్ చరిత్రలో భారత్ ఒకే ఒక్క పతకం గెలిచింది. 2003లో లాంగ్ జంపర్ అంజు బాబి జార్జ్ కాంస్యం సాధించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ అథ్లెటిక్స్‌లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణం
ఎప్పుడు : అక్టోబర్ 6
ఎవరు : నియా అలీ
ఎక్కడ : దోహా, ఖతర్

Published date : 07 Oct 2019 06:56PM