Skip to main content

ప్రముఖ రచయిత్రి, మాలతీ చందూర్ స్మారక అవార్డీ కన్నుమూత

మాలతీ చందూర్ స్మారక అవార్డీ, ప్రముఖ రచయిత్రి సి. ఆనందరామం(85) కన్నుమూశారు.
Current Affairs
గుండెపోటు కారణంగా ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు.ఆమె అసలు పేరు ఆనంద లక్ష్మి. భర్త రామం పేరును తన పేరు చివర జోడించి రచయిత్రి సి.ఆనందరామంగా తెలుగు సాహిత్య లోకంలో రాణించారు.

1935, ఆగస్టు 20వ తేదీన ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆమె జన్మించారు. 1958-60లో ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ. తెలుగు చదివారు. 60 నవలలు, 100కు పైగా కథలు, కొన్ని విమర్శనా గ్రంథాలను రాశారు. ఆమె రాసిన ఆత్మబలి, జాగృతి, మమతల కోవెల వంటి నవలలు సినిమాలు, టీవీ సీరియల్‌లుగా వచ్చాయి.

అవార్డులు...
గృహలక్ష్మి స్వర్ణకంకణం 1972, మాలతీ చందూర్ స్మారక అవార్డు 2013, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు 1979 (తుఫాన్ నవలకు)లు ఆనందరామంను వరించాయి. మాదిరెడ్డి సులోచన బంగారు పతకం 1997, తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాలు రెండు పర్యాయాలు, సుశీలా నారాయణరెడ్డి పురస్కారం, గోపీచంద్ పురస్కారం, అమృతలత జీవన సాఫల్య పురస్కారాలు కూడా ఆమెను వరించాయి.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ప్రముఖ రచయిత్రి, మాలతీ చందూర్ స్మారక అవార్డీ కన్నుమూత
ఎప్పుడు : ఫిబ్రవరి 11
ఎవరు : సి. ఆనందరామం(85)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : గుండెపోటు కారణంగా
Published date : 12 Feb 2021 06:27PM

Photo Stories